Breaking News

ఆ హీరోతో నేను నటించాలా అంటూ ఆ స్టార్ హీరో సినిమా వదిలేసిన తమన్నా

తమన్నా.. మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుంది. ఇప్పటికీ హాట్ హీరోయిన్ గా ఉంది. వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె నటించిన సీటీమార్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య తొలి మూవీలో హీరోయిన్ నటించాలనే ఆఫర్ వచ్చినా నో చెప్పిందట. ఇంతకీ తను ఎందుకు నో చెప్పిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు నాగచైతన్య. జోష్ అనే సినిమా ద్వారా వెండి తెరకు ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమాలో చైతన్య సరసన కార్తీక హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. తొలి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా సాయిపల్లవితో కలిసి నటించిన లవ్ స్టోరీ మూవీ ఓ రేంజిలో హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు అక్కినేని అబ్బాయి.

నాగ చైతన్య నటించిన డెబ్యూ మూవీ జోష్ సినిమాలో ప్రముఖ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక ప్లేస్ లో తమన్నాను తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ ఆ సమయంలో తను ఓకే చెప్పకపోవడంతో కార్తీకను ఫిక్స్ చేశారు. ఇంతకూ తనను ఓకే చెప్పకపోవడానికి కారణం ఏంటంటే.. అప్పుడు తమన్నా వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. ఈ కారణంగానే తన సినిమాకు ఎస్ చెప్పలేకపోయింది. దీంతో కార్తీకను ఓకే చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 100%లవ్ సినిమా ద్వారా తమన్నా.. చైతన్యతో జోడీ కట్టింది. తడాఖా సినిమాలోనూ మరోసారి కలిసి నటించింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *