Breaking News

ఆ స్టార్ హీరోయిన్ భర్త సక్సెస్ కోసం చిరంజీవి ఇంత పని చేస్తున్నాడా ?

మెగాస్టర్ చిరంజీవి రాజకీయాల నుంచి వైదొలిగాక వరుసగా సినిమాలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో కుర్రహీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా కొరటాల డెరెక్షన్‌లో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిరు.. త్వరలోనే వేదాళం.. ఆ తర్వాత లూసిఫర్ మళయాల రీమేక్‌లో నటించనున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో భాగంగా చిరు చేయికి గాయం కాగా, చిన్న పాటి సర్జరీ అయ్యింది. ప్రస్తుతం చిరు విశ్రాంతి తీసుకుంటుండగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా అధిపత్యం చెలాయిస్తున్న నటి భర్త కోసం మెగాస్టార్ గొంతు సవరించుకున్నారు.

ఆ స్టార్ నటి మరెవరో కాదు. బహుబలిలో శివగామి లాంటి పవర్ ఫుల్ పాత్రను పోషించిన అలనాటి హీరోయిన్ రమ్య కృష్ణ. ఆమె భర్త కృష్ణ వంశీ ఒకప్పుడు స్టార్ దర్శకులలో ఒకరు. ఈయనకు క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు కూడా ఉంది. వరుస ఫ్లాపుల తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ‘రంగ మార్తాండ’ సినిమాకు మళ్లీ దర్శకత్వం చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. గత పదేళ్లలో కృష్ణవంశీ నుంచి ఒక్క సూపర్ హిట్ కూడా రాలేదు. అయితే, మరాఠీలో మంచి విజయం సాధించిన సినిమాను తెలుగులో నటసామ్రాట్‌‌గా తెరకెక్కించారు.

ఈ మూవీపై అంచనాలు పెంచే బాధ్యతలను చిరు తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే వాయిస్ ఓవర్ ఇచ్చారని టాక్. దీనికి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ ట్వీట్‌ చేశారు. ‘అడగ్గానే ఏమాత్రం నో చెప్పకుండా.. మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ‘థాంక్యూ అన్నయ్యా’ అంటూ ధన్యవాదాలు తెలిపారు క్రియేటివ్ డైరెక్టర్. అయితే, ‘రంగమార్తాండ’ మూవీలో ప్రకాశ్ రాజ్ తో పాటు నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమాకు పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *