Breaking News

ఆ సీన్ ఉంటేనే సినిమా చూస్తాం.. థియేటర్ల ముందు ధర్నకు దిగిన మహిళలు.. కారణం ఏంటో తెలుసా?

చాలా సీరియస్ విషయాలను చాలా వినోదాత్మకంగా సినిమాలు తీసి జనాల్లోకి తీసుకు వెళ్లడంలో దర్శకుడు జంధ్యాలది అందె వేసిన చేయి అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అదే స్థాయిలో సినిమాలు తీయడంలో ప్రతిభ కనబర్చిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ అని చెప్పుకోవచ్చు. చెవిలో పువ్వు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు సత్యనారాయణ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. వాటిలో పలు ఎంటర్ టైన్మెంట్ సినిమాలతో పాటు సీరియస్ మూవీస్ కూడా ఉన్నాయి.

నిజానికి ఇవివి సత్యనారాయణ ఎక్కువగా కుటుంబ కథా అంశాలను పట్టుకునేవాడు. ఆ రకంగా 1994లో వచ్చిన హలో బ్రదర్, అలీబాబా అరడజన్ దొంగలు, అబ్బాయి గారు, ఆమె అనే సినిమాలు ఆయనను దర్శకుడిగా ఓ రేంజికి తీసుకెళ్లాయి. అందులో ముఖ్యంగా ఆమె సినిమా గురించి చెప్పుకోవాలి. సిరి చిత్ర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో శ్రీకాంత్ హీరోగా చేశాడు. హీరోయిన్ గా ఊహ కనిపించింది. ఆహనా పెళ్లంట సినిమాలో పిసినారిగా కోటా శ్రీనివాసరావు నటించి ఆకట్టుకున్నాడు. ఆమె సినిమాలోనూ కోటా దాదాపు అదే రకమైన పాత్ర పోషించాడు. అజ్ఞానం, మూర్ఖత్వం కలిసిన వ్యక్తిగా అద్భుత నటన కనబర్చాడు.

ఈ సినిమాలో కోటాకు సంబంధించి ఓ సన్నివేశం ఉంటుంది. ఇందులో కోటా భార్యగా సుధ అనే నటి నటించింది. ఒకానొక సమయంలో కోటా ఛాతిపై కాలు పెట్టి స్త్రీ అంటే అబల కాదు.. సబల.. అంతేకాదు ఆదిపరా శక్తి అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తుంది. తొలుత సినిమాలో ఈ సీన్ పెట్టారు. కానీ కొద్ది రోజుల తర్వాత దాన్ని తొలగించాడు. అయితే సినిమాలో ఆ సీన్ ఉండాల్సిందేనని కొన్ని థియేటర్ల ముందు మహిళలు ఆందోళనకు దిగారు. ఆ సీన్ ఉంటే తప్ప సినిమా చూడం అంటూ ధర్నకు దిగారు. ఈ విషయాన్ని నటి సుధ స్వయంగా వెల్లడించారు. అయితే మళ్లీ ఈ సీన్ పెట్టారా? లేదా? అని మాత్రం తను వెల్లడించలేదు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *