Breaking News

ఆ ల్యాండ్స్ కొనుగోలు చేసి దారుణంగా మోసపోయిన నాగార్జున.. చివరకు ఏమైందంటే?

సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లు ఉన్నాయనుకుంటే అందులో ఒకటి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామరావు అయితే మరో కన్ను అక్కినేని నాగేశ్వరరావు అని సినీ వర్గాలు పేర్కొంటుంటాయి. ఇకపోతే అప్పట్లోనే అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున సైతం సత్తా చాటుతున్నారు. భక్తిరస చిత్రాలతో పాటు హెల్దీ రొమాంటిక్ కామెడీ, యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు నాగ్. ఇకపోతే అక్కినేని ఫ్యామిలీ సంపాదించిన డబ్బులతో ఆస్తులను వెనకేసుకోవడంలో అందరికంటే ముందుందనే చెప్పొచ్చు. హైదరాబాద్‌లోని పలు చోట్ల భూములు కొనుగోలు చేశారు. అయితే, వారి బంధువుల దగ్గరి నుంచి నాగార్జున కొన్ని ఏళ్ల కిందట గచ్చిబౌలి సమీప ప్రాంతంలో ఒక భూమిని కొనుగోలు చేసి మోసపోయారని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి బంధువు అనే నమ్మకంతో అక్కినేని నాగార్జున కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుగోలు చేసి మోసపోయారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, ఈ విషయం బయటకు అయితే రానీయలేదు. కేవలం అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులు ఇలా మోసపోయారని సమాచారం. ఇకపోతే అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ హీరోలుగా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. నాగచైతన్య ఇప్పటికే పలు చిత్రాల్లో తన సత్తా చాటాడు. ప్రజెంట్ ‘లవ్ స్టోరి’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో ‘బాలరాజు’ అనే పాత్రను పోషించాడు చైతన్య. తెలుగులో ‘థాంక్యూ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో నాగచైతన్యకు జోడీగా బ్యూటిఫుల్ రాశి ఖన్నా నటిస్తోంది. అఖిల్‌కు మాత్రం ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *