Breaking News

ఆ లేడీ విలన్ మ్యారేజ్ ఫిక్స్..? ఎవరిని చేసుకోబోతుందో తెలుసా..?

కార్తీకదీపం సీరియల్… టీవీ ఆడియన్స్‌లో ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సీరియల్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇందులో దీప పాత్ర ఎంత అమాయకంగా ఉంటోందో.. మోనిత పాత్ర అంత క్రూరంగా ఉంటుంది. ఈ సీరియల్‌లో వీరిద్దరి యాక్టింగ్ పోటాపోటీగా ఉంటుంది. లేడీ విలన్ క్యారెక్టర్‌లో మోనిత యాక్టింగ్ అందరినీ అట్రాక్ట్ చేసింది. సీరియల్ లో ఆమె ఎంట్రీ కోసం చాలా మంది ఇంట్రెస్టింగా ఎదురు చూస్తుంటారు. అలాంటి మోనిత క్యారెక్టర్‌లో ఆమె నటన అద్భుతం. మోతిన అసలు పేరు శోభ. ఆమె కన్నడ నటి అయినా తెలుగు అమ్మాయిగా యాక్ట్ చేస్తూ చాలా మంది ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నది. ఆమె యాక్టింగ్ కోసమే చాలా మంది ఈ సీరియల్ చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్‌లో కార్తీక దీపం సీరియల్ స్పెషల్. ఈ సీరియల్స్‌కు ఉండే ఫ్యాన్స్ మరీ స్పెషల్.

శోభకు సంబంధించిన వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఆమె అతి త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్నదని సోషల్‌మీడియాలో హల్ చల్ అవుతోంది. కన్నడ సీరియల్స్‌లో నటించే ఓ హీరోను పెళ్లి చేసుకోబోతున్నదని తెలుస్తోంది. మరీ ఆ హీరో ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. వీరిద్దరు ఎక్కడ కలిశారు? ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు శోభ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదని తెలుస్తుంది. మరి ఈ వార్తలపై శోభ సైతం స్పందించడం లేదు. ఈ మ్యారేజ్ వార్తలు నిజమేనా? లేక రూమర్సా అని తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. తెలుగులో పాటు కన్నడంలోనూ పలు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్న శోభ. చాలా బిజీగా మారిపోయింది. ఈమె నిర్వహించే యూ‌ట్యాబ్ ఛానెల్స్‌కు సైతం చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడియో అప్‌లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మిలియన్స్ వీవ్స్ రావడం విశేషం.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *