Breaking News

ఆయనను నమ్మి అడ్డంగా మోసపోయి, ఆస్థులు అమ్ముకున్న నందమూరి హీరో..

నందమూరి హీరో హరికృష్ణ తనయుడుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు కల్యాణ్ రామ్. బీభత్సమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వెండి తెరకు పరిచయం అయినా.. ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా హిట్లు కొట్టలేకపోయాడు. పలు సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. ప్రస్తుతం ఆయన తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా చేస్తున్నాడు. మరోవైపు అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు.

కల్యాణ్ రామ్ 1989 బాలగోపాలుడు మూవీతో బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 2003లో తొలిచూపులోనే, అభిమన్యు అనే సినిమాలతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. 2005లో అతనొక్కడే సినిమాతో నిర్మాత తన సత్తా చాటుకున్నాడు. తాను నటించిన సినిమాకు తానే నిర్మాతగా చేశాడు. ఈ సినిమాతో పాటు కిక్-2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ద్వారా పలు సినిమాలు నిర్మించాడు. కానీ ఆయన మంచి విజయాలు అందుకోలేకపోయాడు. ఆర్థికంగా చాలా నష్టపోయాడు.

నిర్మాతగా హిట్లులేక ఇబ్బంది పడతున్నఆయనకు దర్శకుడు సురేందర్ రెడ్డి కిక్-2 మూవీ నిర్మాన బాధ్యతలు అప్పగిస్తానని చెప్పాడు. అందుకు కల్యాణ్ రామ్ ఓకే చెప్పాడు. ఈ సినిమాతో తన అపజయాలకుబ్రేక్ పడుతుంది అనుకున్నాడు. కానీ సినిమా మూడు గంటలకు పైగా వచ్చింది. డ్యూరేషన్ తగ్గించేందుకు దర్శకుడు ఒప్పుకోలేదు. దీంతో పాటు సన్నవేశాలు మళ్లీ చిత్రీకరించారు. దీంతో ఖర్చులు బాగా పెరిగాయి. విజయం వస్తుందని ఖర్చులకు వెనకాడలేదు. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. నిజం చెప్పాలంటే అసలు విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కిక్ -2 మూలంగా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జై లవకుశ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. లాభాలు దక్కించుకున్నాడు. సురేందర్ రెడ్డిని నమ్మక పొతే తన ఆస్తులని కోల్పోవాల్సి రాకపోవు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *