Breaking News

అశ్విని పునీత్.. భర్త చాటు భార్యగా 30 మంది ఉండే ఇంట్లో పెద్ద కుటుంబలో ఎలా కలిసిపోయిందో తెలుసా?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో దేశ వ్యాప్తంగా శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ప్రముఖుల నుంచి సాధారణ జనాల దాకా అందరూ తన గొప్పతనం గురించి వేనోళ్ల పొగుడుతున్నారు. కన్నడ సినిమా పరిశ్రమలో తన తండ్రి రాజ్ కుమార్ ఓ లెజెండరీ హీరో. ఆయన వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన.. తండ్రి మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని జనాల మదిలో నిలిచిపోయాడు. కాసేపు ఆయన సినిమా విషయాలు గట్రా పక్కన పెడితే.. పర్సనల్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పునీత్ రాజ్ కుమార్.. అశ్విని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదీ పెద్దలను ఒప్పించి మూడు ముళ్లు వేశాడు. పునీత్.. అశ్వినికి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యింది. అప్పుడే తను చదువు పూర్తి చేసింది. నిజానికి అశ్విని పెద్ద అందగత్తె ఏమీ కాదు. సినిమా పరిశ్రమలో చాలా మంది అందమైన యువతులను చూశాడు. కానీ పునీత్ మనసుకు నచ్చింది అశ్విని. అప్పుడప్పుడు తనను కలిసేవాడు. ఆమెకు సినిమాలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. పునీత్ ఫ్యామిలీ గురించి కూడా తనకు తెలుసు. వారి మధ్య పరిచయం కాస్త పెరిగింది. తను పెళ్లి చేసుకోబోయేది కన్నడ సూపర్ స్టార్ కొడుకు అని కాదు. జస్ట్ పునీత్ గానే ఇష్టపడింది. సుమారు ఏడు ఎనిమిది నెలల తర్వాతే పునీత్ కూడా తనపై ఓ అంచనాకు వచ్చాడు. తను మా కుటుంబంలోకి వస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఓ రోజు తన తండ్రికి చెప్పాడు. కానీ తల్లితో మాట్లాడాలని చెప్పాడు. తనకు ఓకే అయితే నాకు ఓకే అన్నాడు.

తన తల్లి అమ్మాయిని చూసి ఇష్టపడింది. తను మన కుటుంబంలో సెట్ అవుతుందని భావించింది. ఈ ప్రేమకు అంగీకారం చెప్పింది. అశ్విని వాళ్ల తల్లిదండ్రులు ఈ పెళ్లికి నో చెప్పలేదు కానీ.. పెద్ద ఇంట్లో తమ బిడ్డ ఇముడుతుందో? లేదో అని మాత్రం అనుమాన పడ్డారు. అందుకే కొంత కాలం పాటు వీరి పెళ్లిని వాయిదా వేశారు. మరో ఆరు నెలల తర్వాత అశ్విని, పునీత్ పెళ్లి చేసుకోవాలి అనుకోవడంతో చివరకు రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి. అశ్విని, పునీత్ ఒక్కటయ్యారు. ఆతర్వాత ఆ కుటుంబలో ఇమిడిపోయింది. చక్కగా కలిసిపోయింది. తన 22 సంవత్సరాల వైవాహిక జీవితంలో భర్తచాటు భార్యగానే కొనసాగింది. కానీ కాలం అశ్వినికి తీరని లోటును మిగిల్చింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *