Breaking News

అవకాశాల కోసం గుడ్డిగా నమ్మి మోసపోయా .. నటి సనా

సన.. ముస్లీం అయినా.. తెలుగు సినిమా పరిశ్రమలో చక్కటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా, సిస్టర్ గా ఎన్నో పాత్రలు పోషించింది. వైవిధ్య భరిత సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. పలు నెగెటివ్ రోల్స్ కూడా చేసి ఆకట్టుకుంది. వెండి తెర ఒక్కటే కాదు.. బుల్లి తెర మీద కూడా తను పలు సీరియల్స్ లో నటించింది. పాత్ర ఏదైనా సరే ఒదిగిపోయి నటించడం ఆమె ప్రత్యేకత. అయితే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన వారు ఏదో ఒక సందర్భంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సనా కూడా తెలుగు సినిమాపరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.

కొద్ది రోజుల క్రితం సనా అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అంతే కాదు పలు విషయాల గురించి చెప్తూ ఎమోషల్ అయ్యింది. సినిమా పరిశ్రమలో తనకు ఎంతో మంది హెల్ప్ చేశారని చెప్పింది. అంతే మంది మోసం చేసినట్లు చెప్పింది. ఎంత మంది నిన్ను మోసం చేశారు? అని అలీ అడిగిన ప్రశ్నకు.. తాను ఏఏ సందర్భంలో మోస పోయిన విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. కంట తడి పెట్టిన ఆమెను అలీ ఓదార్చాడు కూడా.

సినిమా పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించింది. ఈ సమయంలోనే తనను చాలా మంది మోసం చేసినట్లు చెప్పింది. తనకు ఒకానొక సమయంలో ఎంతో బాధ కలిగినట్లు చెప్పింది. అందరినీ గుడ్డిగా నమ్మి మోస పోయినట్లు చెప్పింది. తన కెరీర్ కోసం ఎన్నో అవస్థలు పడినట్లు చెప్పింది. కానీ ఆ తర్వాత తనను తాను కష్టాల నుంచి బయట పడేసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈమె సినిమాలు తక్కువగా చేస్తుంది. బుల్లితెర మీద మాత్రం పలు సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. నటిగా మంచి గుర్తింపు మాత్రం దక్కించుకుంది సనా.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *