Breaking News

అవకాశాలు రాక డెలివరీ బాయ్‌గా మారిన సినీ యాక్టర్.. ఎవరంటే..?

ప్రస్తుత కాలంలో డబ్బే అన్నింటికి మూలం. బ్రతకాలంటే డబ్బు సంపాదించాల్సిందే.. కొందరు ఉద్యోగం చేస్తూ.. మరికొందరు వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. కొందరైతే ఓ వైపు చదువుకుంటూ మరో వైపు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఖర్చుల కోసం డబ్బులు సంపాదిస్తారు. మరి కొందరు రెగ్యులర్‌గా జాబ్ చేస్తూనే డబ్బులు సరిపోక పార్ట్ టైం జాబ్ సైతం కంటిన్యూ చేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలోనూ చాలామంది ఇంటస్ట్రీలో కొనసాగుతూనే రకరకాల బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఓ వైపు సినిమాలో అవకాశం కోసం ట్రై చేస్తూనే.. మరో వైపు డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకునేందుకు ఆయనకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం చేస్తున్నాడు యాక్టర్ చేతన్‌రావు. నటనపై అతనికి ఉన్న ఆసక్తి అలాంటిది. సినిమాల్లో నటించేందుకు ఏ చిన్న చాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు.

సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘భారత్’ అనే మూవీలో చేతన్‌రావుకు చాన్స్ వచ్చింది. ఢిల్లీ క్రైం, సావధాన్ ఇండియా వంటి వెబ్ సిరీస్‌లలో నటిస్తూ.. నటనపై తన కోరికను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. చాన్స్ వచ్చినప్పుడు సినిమాలో నటిస్తూ.. మిగతా టైంలో డెలివరీ బాయ్‌గా పని చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి రాజేశ్ అనే ఓవ్యక్తి ఆన్ లైన్‌లో ఫుడ్‌ను ఆర్డరిచ్చాడు. దానిని చేతన్ రావు తీసుకురావడంతో అతడిని చూసిన రాజేశ్ షాకయ్యాడు. ‘మీరు భారత్ అనే మూవీలో నటించారుగా’అని రాజేశ్ అతనిని అడగడంతో ప్రజలు తనను ఓ నటుడిగా గుర్తిస్తున్నారని చేతన్ సంతోషపడ్డాడు. ఈ క్రమంలో చేతన్ చేస్తున్న పనిని రాజేశ్ ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. అంతే మరి కూటి కోసం కోటి విద్యలు అన్నారు. అయినా నిజాయితీగా కష్టపడి పనిచేసే వారికి ఎక్కడికెళ్లినా గౌరవం, మర్యాద దక్కుతుందనడానికి చేతన్ రావే నిదర్శనం. మనకు తెలిసి చేతన్ రావు ఒక్కడే.. కానీ మనకు తెలియని చేతన్ రావులు ఇంకెంత మంది ఉన్నారో మరి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *