Breaking News

అయ్య బాబోయ్ బిగ్ బాస్.. జనాదరణ కరువైన రియాలిటీషో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి..

బిగ్ బాస్.. గత కొద్ది వారాలుగా మాటీవీలో ఈ రియాలిటీ షో ప్రసారం అవుతుంది. అయితే షో ప్రారంభం అయిన రెండు మూడు వారాలు మాత్రం మంచి రేటింగ్ తో జనాల్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కాస్త అటు ఇటుగా రేటింట్స్ వచ్చాయి. ఏదేమైనా గడిచిన నాలుగు సీజన్లు మాత్రం మంచి రేటింగ్ నే సంపాదించుకున్నది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ షో మొదలై సుమారు 7 వారాలు అవుతుంది. ఇప్పటికే ఈ షో నుంచి ఆరుగురు ఇంటి సభ్యులు షో నుంచి బయటకు వెళ్లారు. మొత్తం 19 మందిలో ప్రస్తుతం 13 మంది మాత్రమే ఆడుతున్నారు.

బిగ్ బాస్ షో మొదలయ్యాక తొలి రెండు వారాలు మంచి జనాదరణ దక్కింది. ఆ తర్వాత కాస్త రేటింగ్ తగ్గుతూ వచ్చింది. గత వారం నుంచి అయితే పూర్తిగా రేటింగ్ పడిపోయింది. వీకెండ్ లో మాత్రం నాగార్జున కనిపించడంతో జనాలు కాస్త చూస్తున్నారు. మిగతా వారమంతా జనాలు ఈ షోను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయితే రాను రాను వీకెండ్లను కూడా జనాలు పట్టించుకున్న పాపానపోవట్లేరు. అటు గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ మరీ చప్పగా సాగుతోంది. ఈ షోలో గ్లామర్ పూర్తిగా మిస్ అయ్యింది. లహరి, హమీదా, శ్వేతా గ్లామర్ డాల్స్ గా పిలిపించుకున్నారు హమీదా, శ్రీరామ్ మధ్య లవ్ ట్రాక్ కోసం కూడా జనాలు ఈ షో చూశారు. అయితే హమీదాతో పాటు శ్వేతాను ఎలిమినేట్ చేయడంతో చాలా మంది ఈ షో చూడ్డం మానేశారు. అటు కంటెస్టెంట్ల మధ్య గొడవలు చాలా మంది నచ్చక షోను చూడ్డం లేదనే టాక్ నడుస్తోంది.

అటు ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగాలని జనాలు కోరుకుంటున్నారు. అదికూడా అందాల భామను ఇంట్లోకి తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రెండు వారాలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకుంటున్నా.. ఇప్పటికీ ఆ ఊసేలేదు. అటు వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేది వీరే అంటూ సోషల్ మీడియా చిచ్చర పిడుగు ప్రీతీ అన్షు, ఎలిమినేట్ అయిన లహరి హౌస్ లోకి వస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరో వస్తారో చెప్పడం మాత్రం కష్టంగా ఉంది. మొత్తంగా ఈ షో మాత్రం రానురాను జనాలకు రుచించడం లేదనేది మాత్రం వాస్తవం.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *