Breaking News

అయ్యో అనుపమ పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందా..? త్వరలో తెరమరుగైపోతుందా ?

అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.. ఈ పేరు చెబితే చాలా మందికి ఆమె క్యూటెస్ట్ ఫేస్ గుర్తొస్తుంది. ప్రేమ‌మ్ సినిమాతో హీరోయిన్‌గా అర‌గ్రేటం చేసిన అనుప‌మా.. శ‌త‌మానం భ‌వతి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. తెలుగుంట ప్ర‌జ‌లు సొంతం చేసుకున్న అతి కొద్ది మంది న‌టిల్లో ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ ముందు వ‌రుస‌లో ఉంటారు. పేరుకు మ‌ళ‌యాలి న‌టే అయినా త‌ను మ‌ల‌యాళంలో చేసింది కేవ‌లం 5 సినిమాలే. కానీ తెలుగులో మాత్రం మంచి సినిమాలో చేసింది. తెలుగు ప్రేమ‌మ్‌, శ‌త‌మానం భ‌వ‌తి, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ, కృష్ణార్జున యుద్దం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోస‌మే, ర‌క్ష‌సుడు అనే సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఎక్కువ‌గా అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటుంది. చ‌క్క‌గా తెలుగింటి ఆడ‌పిల్ల‌లా క‌నిపిస్తూ ఉంటుంది. ఆ ర‌క‌మైన దుస్తుల్లోనే త‌ను అందంగా క‌నిపిస్తుంది. రామ్ స‌ర‌స‌న న‌టించిన హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమాలో క్యారెక్ట‌ర్ డిమాండ్ చేసినా.. త‌న ప‌రిధిలో కొంచెం ఎక్సోపోజింగ్ చేసింది. హీరో నానితో న‌టించిన కృష్ణార్జున యుద్దం సినిమాలో ఫారెన్ గ‌ర్ల్‌గా క‌నిపించిన‌ప్ప‌టికీ అక్క‌డ కూడా త‌న క‌ట్టూ బొట్టుతోనే అందంగా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది.
అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటుంది. త‌న సినిమాల్లో ఎక్క‌డా అతి క‌నిపించదు. చాలా ప‌ద్ద‌తిగా, ల‌క్ష‌ణంగా తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. అందుకే మ‌న తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓన్ చేసుకున్నాయి. అయితే ఎక్సోపోజింగ్ వ‌ద్ద‌నుకోవ‌డ‌మే త‌ను కెరీర్ ప‌రంగా పెద్ద‌గా ఎద‌గ‌లేక‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని సినీ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్ర‌తీ సినిమాలో ఒకేలా క‌నిపించ‌డం కూడా అవకాశాలు ఎక్కువ‌గా రాక‌పోవ‌డానికి మ‌రో కార‌ణం. త‌న‌తో పాటు వ‌చ్చిన ఇత‌ర హీరోయిన్‌లు మంచి ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతుంటే.. అనుప‌మ మాత్రం రెండంకెల సంఖ్య కూడా దాట‌లేక‌పోతోంది. విలువ‌లు పాటిస్తూ, మంచి కారెక్ట‌ర్లే చేసేవాళ్ల‌కు పెద్దగా అవ‌కాశాలు ద‌క్క‌వ‌ని చెప్ప‌డానికి ఇది ఒక ఉదాహర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *