Breaking News

అమ్మ మీద ఒట్టేసి చెప్తున్న అబద్ధం చెప్పాను.. సిగ్గుతో త‌లెత్తుకోలేక‌పోయిన ర‌వి

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌-5కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సీజ‌న్ స్టార్ట్ అయిన మొద‌టి రోజు నుంచే ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ పంచుతోంది. 19మంది కంటెస్టెంట్లతో ప్ర‌తి వారం ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తూనే ఉన్నారు. ఎలిమినేట్ ప్ర‌క్రియ అంటేనే కంటెస్టెంట్లు పెద్ద భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎవ‌రైతే నామినేష‌న్ లో ఉంటారో వారికి ఆ వారం అంతా టెన్ష‌నే అని చెప్పాలి. ఇక నామినేష‌న్‌లో లేని వారికి ఆ వారం అంతా ఎంజాయ్ మెంట్ లాగే అనిపిస్తుంది. ఇక నాలుగో వారం నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా ర‌చ్చ ర‌చ్చ‌గా సాగింది. అయితే ఈ సారి నామినేట్ చేసే ట‌ప్పుడు ఒక్క‌క్కరి బండారం గురించి బ‌య‌ట పెడుతూ కంటెస్టెంట్లు సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

ఈ సారి హౌస్ లో నామినేట్ చేసే వారి ముఖంలోని ఓ భాగాన్ని తీసేసి హౌస్‌లోని ఫూల్‌లో వేసేయాలంటూ బిగ్ బాస్ చెప్ప‌డంతో కంట‌స్టెంట్లు అలాగే చేస్తారు. ఇక లోబో, ప్రియ ఒక‌రినొక‌రు నామినేట్ చేసుకుంటూ పెద్ద గొడ‌వ‌నే చేస్తారు. లోబో నామినేట్ స‌మ‌యంలో ప్రియ త‌న ల‌వ్ స్టోరీ గురించి చెప్పిన‌ప్పుడు కావాల‌ని ఎగ‌తాలి చేసింద‌ని, సినిమా స్టోరీలా ఉందని అవ‌హేళ‌న‌గా మాట్లాడిందంటూ పెద్ద‌గా అరుస్తాడు. దీంతో ప్రియ కూడా గ‌ట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇక వీరి త‌ర్వాత విశ్వ‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌ మ‌ధ్య కూడా ఇలాంటి గొడ‌వే జ‌రుగుతుంది.

అయితే ష‌ణ్ముఖ్ వ‌చ్చి యాంక‌ర్ ర‌విని, లోబోను, అలాగే కాజల్ కూడా నటరాజ్‌ మాస్టర్‌, సన్నీ ఫొటోల‌ను ఫూల్‌లో ప‌డేస్తుంది. ఇక సిరి ఏమో లోబో, యానీ మాస్టర్‌ను, శ్వేత కూడా లోబోతో పాటుగా రవిని నామినేట్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. అయితే వీరి త‌ర్వాత వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి సిగ్గుతో త‌ల‌దించుకుంటూ మాట్లాడుతాడు. శ‌నివారం నాడు త‌న అమ్మ మీద ఒట్టేసి కావాల‌ని అబ‌ద్ధం చెప్పానని అందుకు సిగ్గుతో చ‌చ్చిపోతున్నానంటూ కుమిలిపోయి ఎమోష‌న‌ల్ అవుతాడు. ప్రియ‌తో చెప్పిన‌ మాట‌ల‌ను చెప్ప‌లేద‌ని ఎలా అబ‌ద్ధం ఆడానంటూ త‌న‌కు తాను తిట్టుకుంటున్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తాడు. ఇక శ‌నివారం త‌న జీవితంలోనే ఒక వ‌ర‌స్ట్ రోజంటూ ఆవేద‌న చెందుతాడు ర‌వి. ఇక తాను కాజ‌ల్‌ను, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్ చేస్తున్న‌ట్టు చెప్పాడు. ఇక ఈ వారం స‌న్నీ, సిరి, యానీ మాస్టర్, లోబోల‌తో పాటుగా నటరాజ్ మాస్ట‌ర్‌, కాజల్ అలాగే రవి, ప్రియలు నామినేట్ అయిన‌ట్టు బిగ్ బాస్ చెప్తాడు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *