Breaking News

అమ్మా అనే పిలుపుకు నోచుకోని టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఆడ జీవితానికి అసలైన సాకారం అమ్మతనం అంటారు చాలా మంది. చిన్నారి చేత అమ్మా అని పిలిపించుకున్న నాడే మాత్రుత్వపు విలువ తెలుస్తుంది అంటారు. తన చేయి పట్టుకుని నడిపించిన నాడు కలిగే అనుభూతి అత్యంత మధురం అంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు పిల్లల విషయంలో చాలా తప్పు చేశారు. ప్రస్తుత జీవితం గురించి ఆలోచించి.. భవిష్యత్తును పోగొట్టుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రేవతి
ఈమె పలు చక్కటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్లస్ టు చదువుతున్న నాటి నుంచే నాటకాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. పెళ్లి తర్వాత కూడా తను సినిమాల్లో నటించడం మూలంగా పిల్లల్ని కనలేదు. ఒకవేళ పిల్లల్ని కంటే సినిమా అవకాశాలు రావు అనుకుంది. కానీ చిరవకు పిల్లలు కావాలనుకున్నా కాలేదు.

విజయశాంతి
ఒకప్పుడు లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి పరిస్థితి కూడా ఇంతే. శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. కానీ తను పిల్లల్ని కనే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ భామ.. పిల్లల వైపు ఆలోచన పెంచుకోలేదు. సమాజమే తనకు పిల్లలు అని చెప్పుకొచ్చింది.

శారద
ఈమె కూడా చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చింది. అందంతో పాటు అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తన 22వ ఏట చలం అనే నటుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా శారద సినిమాల్లో బిజీగానే ఉంది. అందుకే తనకు కూడా పిల్లలు కాలేదు.

జయప్రద
హీరోయిన్ గా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే సినిమా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మెహతాను పెళ్లి చేసుకుంది. కానీ ఎక్కువ కాలం కలిసి ఉండకపోవడంతో పిల్లలు కాలేదు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

One comment

  1. NUV CHINAPUDE PELLI CHESKUNAV.NUV CHINAPDU NUNCHE RASTUNAV.INTA CHANDALAM GA EVADU ARTICLE RAYADU .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *