Breaking News

అప్పట్లో రవితేజ, త్రిష మధ్య నిజంగానే ఆ సంబంధం ఉందా? తాగి రోడ్ పై ఆ పరిస్థితుల్లో దొరికిపోయి.. చివరికి

రవితేజ. సినిమా పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలు చేసి.. మాస్ మహారాజ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి రవితేజ ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చెన్నై వీధుల్లో ఎన్నో అన్నంలేని రోజులు గడిపాడు. నెమ్మదిగా చిన్న చిన్న పాత్రలు చేసిన రవితేజ.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. హిట్ సినిమాలు చేసి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఈ హీరో.. ఒకప్పుడు త్రిషాతో కలిసి రచ్చ చేసి రచ్చకెక్కాడు. ఇంతకీ అప్పట్లో వీరిపై ఎందుకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగులో రవితేజ, త్రిష కలిసి పలు సినిమాల్లో నటించారు. వరుస బెట్టి వీరిద్దరు పలు సినిమాల్లో నటించడంతో.. అప్పట్లో వీరిపై పలు వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే టాక్ నడిచింది. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. ఎక్కువ సినిమాల్లో కలిసి నటించడం వల్ల ఏదో సంబంధం ఉందని చెప్పడం సరికాదన్నారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

తమ మధ్య ఏ సంబంధం లేదని చెప్పారు కానీ.. బయట మాత్రం ఇద్దరూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగారు. పలుమార్లు మీడియా కంట చిక్కారు కూడా. ఓసారి వీరిద్దరు కలిసి కార్లో వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో త్రిష చేతిలో మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. అప్పుడు డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు కూడా బుక్ చేశారు పోలీసులు వీరిద్దరికి జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వీరి కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. రవి తేజ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. త్రిష తెలుగులో ఏ ప్రాజెక్టు చేయడంలేదు. తమిళంలో మాత్రం కొన్ని సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *