Breaking News

అఖిల్ కి జీవితంలో పెళ్లి కాదు , పెళ్లి అయినా చై కి విడాకులు ఇప్పించావ్, ఏంటండీ ఇది

అక్కినేని ఫ్యామిలీకి పెళ్లి భయం పట్టుకుందని తెలుస్తోంది. వారి కుటుంబంలో ANR సక్సెస్ ఫుల్ జర్నీ తర్వాత.. కొడుకు నాగార్జున ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రామానాయుడు కుటుంబానికి చెందిన ఆడపడుచును నాగార్జున పెళ్లాడిన విషయం తెలిసిందే. నాగచైతన్య జన్మించాక కొన్ని మనస్పర్ధల కారణంగా నాగ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి అయితే వీరిద్దరూ ఎలాంటి మనస్పర్దలు లేకుండా కలిసే ఉంటున్నారు అనుకో. అయితే, నాగ్ తర్వాత వారిద్దరి కుమారుల పరిస్థితి ఇలా అయ్యిందేంటని నాగ్ తెగ ఆవేదన చెందుతున్నాడట. పెళ్లి తంతు.. తమ కుటుంబంలో కలిసి రావడం లేదని సన్నిహితులతో చెప్పుకుని బాధపడినట్టు తెలుస్తోంది.

మొన్నటికి మొన్న నాగ్ అమల సంతానమైన అఖిల్‌కు నాగచైతన్యతో పాటే వివాహం చేయాలని తండ్రి నాగ్ భావించాడు. అప్పటికే అఖిల్ శ్రీయా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించడం, ఈ విషయం ఇంట్లో చెప్పడం, వారు కూడా అంగీకరించడంతో వీరి లవ్ స్టోరీ నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే, ఎంతో ఘనంగా జరిగిన వీరి నిశ్చితార్థం మాత్రం పెళ్లి పీటలెక్కకుండానే ముగిసిపోయింది.

అయితే, అఖిల్ పెళ్లి ఎంతో గ్రాండ్‌గా చేయాలని ఇరు కుటుంబాలు భావించాయి. ఈ క్రమంలోనే శ్రియా భూపాల్, అఖిల్ మధ్య మనస్పర్థలు రావడంతో నిశ్చితార్థంతోనే వివాహానికి ముగింపు పలికారు ఇరు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత శ్రియా మరో అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది.కానీ, అఖిల్ మాత్రం ఇంకా పెళ్లిచేసుకోకుండా సినిమాలు చేస్తూ లైఫ్ లో బిజీగా ఉండిపోయాడు. ఇకపోతే ఏం మాయ చేశావే మూవీతో కలిసిన సమంత, ,చైతన్య ఏడేళ్లు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి జంటను చూసి టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. అంతా బాగానే సాగుతుంది అనుకునేలోపు సామ్ చై విడిపోతున్నారనే వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాతో పాటు వార్త చానెళ్లలో ఎక్కడ చూసినా సామ్ చై విడాకుల మ్యాటర్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

చివరకు, అదే నిజమని సామ్ చై క్లారిటీ కూడా ఇచ్చేశారు. దీంతో నాగ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఏంటి ఇది అసలు అప్పుడు అఖిల్ పెళ్లి నిశ్చితార్థంతో ఆగిపోయింది. చైతన్య జీవితం ఇలా అయిపోయిందంటూ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించకుంటున్నారు.ఇదే విషయంపై నాగార్జున కూడా లోలోపల మదన పడుతున్నట్టు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ పెళ్లి కలిసిరావట్లేదని జోరుగా చర్చించుకుంటున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *