Breaking News

అఖిల్ అయ్యగారు ఎలా అయ్యాడు? నాగరాజు మాటలు ఎందుకు వైరల్ గా మారాయి? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి?

సినిమా హీరోలకు చాలా మంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల్లో కొంత మందికి విపరీతమైన అభిమానం ఉంటుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే హీరోల ఫ్యాన్స్ కు కూడా కొంది ఫ్యాన్సుగా మారుతారు. తాజాగా అక్కినేని అఖిల్ అభిమానికి విపరీతమైన ఫాలోయింగ్ పెరగడం విశేషం. అఖిల్ ను అయ్యగారు అని పిలుస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాదు.. ఇతడి గురించి అఖిల్ కూడా ప్రత్యేకించి ప్రస్తావించాడు. తన కంటే తన ఫ్యాన్స్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. ఇంతకీ అఖిల్ ను అయ్య గారిగా మార్చిన ఆ అభిమాని కథేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం అఖిల అభిమానిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ యువకుడి పేరు నాగరాజు. గుంటూరుకు చెందిన రోజు వారీ కూలి. ఇతడికి సినిమాలంటే చిన్నప్పటి నుంచే ఇష్టం. అక్కినేని ఫ్యామిలీ అంటే ఇంకా ఇష్టం. నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్ దగ్గర బాగా సందడి చేస్తాడు. అటు నాగ్ రాజు గారి గది-2 సినిమా గుంటూరు పల్లవి కాంప్లెక్స్ థియేటర్ లో విడుదల అయ్యింది. ఎందోకో ఇతడికి ఆ సినిమా నచ్చలేదు. దీంతో కింగ్ కొడుకు రావాలి. అఖిల్ నెంబర్ వన్ కావాలి. అయ్యగారు రావాల్సిందే అని మీడియా ముందు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

చాలా మంది అయ్యగారు అంటూ అఖిల్ ను ఆట పట్టించారు కూడా. చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. అఖిల్ కు అయ్యగారు అనే పేరు తగిలించారు కూడా. అటు నాగరాజు మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. నాగరాజు మీద చాలా మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేవాయి. తాను ఎప్పటికీ అక్కినేని అభిమానిగానే ఉంటానని చెప్పాడు నాగరాజు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *