Breaking News

అక్కినేని ఫ్యామిలీ కోసం సమంతా ఎన్నో త్యాగాలు చేసింది.. మేకప్ ఆర్టిస్ట్ సంచలన కామెంట్స్..

సమంతా, నాగ చైతన్య విడిపోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి దారి వారే చూసుకుంటున్నారు. అయినా ఇద్దరిపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరి విడాకులకు ఇవే కారణాలు అంటూ రకరకాల వార్తలు వండి వారుస్తున్నారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. తమ విడాకుల వ్యవహారం గురించి నాగ చైతన్య తొలి నుంచి సైలెంట్ గానే ఉంటున్నాడు. ప్రకటన తర్వాత కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే సమంతాపైనే వెబ్ సైట్లు ఎక్కువ ఫోకస్ చేశాయి. అంతేకాదు.. చైతన్యతో పోలిస్తే సమంతాపైనే ఎక్కువ రూమర్లు వస్తున్నాయి.

ఈ విడాకులకు కారణం అక్కినేని ఫ్యామిలీయే అని ఓవైపు వార్తలు వస్తుంటే.. కాదు.. సమంతా ఆటిట్యూడే కారణం అంటున్నారు మరికొందరు. అంతేకాదు.. సమంతాకు చెందిన పలు విషయాలను వెబ్ సైట్లు వెతికి మరీ రాస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ వారి విడాకులకు కారణాలు ఏంటి అని వెతికే పనిలో ఉన్నారు సమంతా, అక్కినేని ఫ్యాన్స్. తాజాగా మరో కీలం అంశం గురించి చర్చ నడుస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సమంతా దగ్గర గత కొంత కాలంగా సాధన సింగ్ అనే ఆవిడ మేకప్ ఆర్టిస్టుగా పని చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ కోసం సమంతా ఎన్నో త్యాగాలు చేసిందని ఈమె కామెంట్ చేసింది. సమంతాకు పిల్లలు కనడం ఇష్టం లేదనే వార్తలను ఆమె ఖండించింది. చైతన్య అంటే సమంతాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఆయన మీదే ఇన్నాళ్లు ఎన్నో హోప్స్ పెట్టుకున్నట్లు వెల్లడించింది. కేవలం అక్కినేని ఫ్యామిలీ కోసమే తను పెద్ద పెద్ద సినిమాలు వదిలేసినట్లు వెల్లడించింది. అలాంటి నాగ చైతన్య, సమంతా ఎందుకు విడిపోయారో అర్థం కావడం లేదని చెప్పింది. సమంతా ఎప్పుడూ తమను పరాయి వ్యక్తుల్లా చూడలేదని సాధన వెల్లడించింది. ఇకపై సమంతా స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉందని చెప్పింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *