Breaking News

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఒకటి, అర తప్ప.. మిగతా సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నవే. ఒకప్పుడు రచయితగా అవకాశాల కోసం హీరోలు, దర్శకుల వెంట తిరిగిన ఆయన.. ప్రస్తుతం పలువురు హీరోలు తనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే స్థాయికి చేరాడు. కాసేపు సినిమాల గురించి పక్కన పెడితే.. ఆయన వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకుందాం.. ఆయన పెళ్లి విషయంలో జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో త్రివిక్రమ్ జన్మించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. పోసాని క్రిష్ణ మురళీ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. అదే సమయంలో సునీల్ తో కలిసి ఒకే రూంలో ఉన్నాడు. 19998లో స్వయం వరం సినిమాకు మాటలు రాశాడు. ఆ తర్వాత పలు సినిమాలకు అద్భుత మాటలు అందించి మాటల మాత్రింకుడిగా పేరు పొందాడు. ఆయన రాసే పంచులు జనాలకు బాగా నచ్చాయి. అందుకే ఆయన చాలా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం దర్శకుడిగా మారి.. టాప్ దర్శకుడిగా ఎదిగాడు.

ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ఆయన పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందని త్రివిక్రమ్ చెప్పాడు. త్రివిక్రమ్ భార్య సౌజన్య. ఈమె ప్రముఖ పాటల రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి మేన కోడలు. నిజానికి సౌజన్య వాళ్ల అక్కను పెళ్లి చేసుకోవడానికి వెళ్లాడు త్రివిక్రమ్. కానీ తనకు సౌజన్య బాగా నచ్చింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే అక్క పెళ్లి చేసే వరకు ఆగాలని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆమె అక్క పెళ్లి జరిగే వరకు ఆగాడు. ఆ తర్వాత 2002లో త్రివిక్రమ్- సౌజన్య పెళ్లి జరిగింది.

About Mamatha

Check Also

జబర్దస్త్ నుంచి సుధీర్ ఔట్.. పాపం అంత బాధను అనుభవించాడా ?

సుడిగాలి సుధీర్. బుల్లితెరపై ఫలు షోలు చేస్తూ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో పస్త్ పాపులారిటీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *