Breaking News

అక్కడ సర్జరీ ఫెయిల్.. అంధవికారంగా రకుల్ ప్రీత్ సింగ్..!

సెలబ్రిటీలు స్క్రీన్‌పై తమ అప్పియరెన్స్ అందంగా ఉండేందుకుగాను రకరకాల సర్జరీలు చేయించుకుంటారన్న సంగతి అందరికీ విదితమే. అయితే, సర్జరీలన్ని కూడా సక్సెస్ అవుతాయన్నా గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు సర్జరీలు ఫెయిల్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీలు ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా, తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకున్నట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోను బట్టి ఆమె సర్జరీ చేసుకుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ గతంలోని ఫొటోలను ప్రజెంట్ ఇన్ స్టా హ్యాండిల్‌లో షేర్ చేసిన ఫొటోలను కంపేర్ చేస్తున్నారు. గతంలోని చిత్రాల్లో చాలా అందంగా కనిపిస్తున్న రకుల్ తాజా చిత్రంలో భిన్నంగా కనిపించడాన్ని బట్టి ఆమె కాస్మొటిక్ సర్జరీ చేసుకుందన్న అభిప్రాయానికి వస్తున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం రకుల్ ఫిల్టర్ యాప్ యూజ్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు. లిప్ సర్జరీ వల్ల చేంజ్ అయినట్లు స్పష్టంగా కనబడుతున్నదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ విషయమై రకుల్ ప్రీత్ సింగ్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. ఈ సంగతులు ఇలా ఉంచితే.. రకుల్ నటించిన పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

క్రిష్ డైరెక్షన్‌లో ‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొండపొలం’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ ఫిల్మ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో పాటు ‘అటాక్, అక్టోబర్ థర్టీ ఫస్ట్ లేడీస్ నైట్, అయలాన్, మేడే, థాంక్ గాండ్, డాక్టర్ జీ, ఇండియన్ 2’ చిత్రాల్లో రకుల్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇకపోతే రకుల్ కాస్మొటిక్ సర్జరీ గురించి టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌తో పాటు బీ టౌన్ సర్కిల్స్‌లో నూ చర్చ జరుగుతున్నది. అయితే, సెలబ్రిటీలు తమ రూపాన్ని మార్చుకునేందుకు సర్జీరీలు చేయించుకోవడం కొత్తేమీ కాదని, గతంలో చాలా మంది సర్జీలు చేయించుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *