Breaking News

అందువల్లే ఐదుగురు కుటుంబీకులు చనిపోయారన్న నటి… కారణం ఏంటంటే…

ఓ ప్రముఖ చానల్ లో వచ్చే క్యాష్ ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రాంను టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ చాలా రసవత్తరంగా తీర్చి దిద్దుతారు. ఈ ప్రోగ్రాంకి నటి వరలక్ష్మి వచ్చి కన్నీటి పర్యంత మయింది. తన కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కోవిడ్ వలన మరణించారని చెబుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది. దీపావళి ప్రత్యేక ఎపిసోడ్ లో నటి వరలక్ష్మీతో పాటు దివ్యవాణి, యమున, ఆమని కూడా సందడి చేశారు. వీరి నలుగురితో యాంకర్ సుమ ఓ ఆటాడుకున్నారు. కానీ చివర్లో మాత్రం నటి వరలక్ష్మీ తన కుటుంబాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయింది. వరలక్ష్మీని తోటి కంటెస్టెంట్లయిన దివ్యవాణి, యమున, ఆమని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు రాత్రి ఈటీవీలో 9.30 నిముషాలకు ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది.

ఈ ప్రోగ్రాం మొత్తం చాలా సరదాగా సాగింది. యాంకర్ సుమ కంటెస్టెంట్లతో రకరకాల ఆటలు ఆడించింది. డ్యాన్సులు చేయించి, తొక్కుడు బిళ్ల, వీరివీరి గుమ్మడి పండు లాంటి తదితర ఆటల్ని ఆడించింది. కేవలం ఆటలు ఆడడం మాత్రమే కాకుండా పలువురు కంటెస్టెంట్లు టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇక వరలక్ష్మీ విషయానికి వస్తే ఆమె బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణ, వెంకటేశ్ ఇలా అందరి హీరోలకు చెల్లెలుగా నటించి మెప్పించారు. వరలక్ష్మీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ భాషలో కూడా తన నటనా ప్రతిభను చూపెట్టింది. హిందీలో దాదాపు 200 పైచిలుకు సినిమాల్లో నటించారు. ఇందులో కూడా దాదాపు 100 సినిమాల్లో సోదరి వేషాల్లో నటించి మెప్పించారు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా కథా నాయికగా కూడా కొన్ని చిత్రాల్లో మెరిశారు. వరలక్ష్మీని ఆంధ్రా సిస్టర్ అని ముద్దుగా పిలుస్తారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *