Breaking News

అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు : నటి శోభన

యాక్ట్రస్ శోభన… తెలుగు ఇండస్ట్రీకి ఈ పేరు గురించి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్రమ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ తర్వాత ఇక వరుసగా స్టార్ హీరోలతో మూవీస్ చేసింది. విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వంటి పెద్ద హీరోలతో మూవీస్ చేసి తన ప్రత్యేకతను ఇండస్ట్రీకి తెలియజెప్పింది. కేవలం తెలుగు ల్యాంగ్వేజ్‌లోనే కాకుండా కన్నడ, తమిళ మూవీస్ లోనూ నటించి అక్కడ సైతం ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఆమె యాక్ట్రస్ మాత్రమే కాకుండా డ్యాన్సర్ గా సైతం అందరి మన్ననలు పొందింది. చెన్నైలో చిదంబంరం నాట్య అకాడమీ అనే అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. భరతనాట్యంలో అభినయాన్ని చూపించడంలో శోభనకు మరెవరూ సాటిరారు. ఇన్ని ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నాట్యంలో ట్రైనింగ్ తీసుకునేందుకు చాలా మంది శోభన వద్దకు వస్తారు. దీనిని బట్టి అర్థం చేసుకోచ్చు ఆమెకు డ్యాన్సులో ఎంత ట్యాలెంట్ ఉందో..

ఇక ప్రస్తుతం శోభన వయస్సు దాదాపుగా 50 సంవత్సరాలు. ఏజ్ పెరుగుతున్నా ఆమె ఇంత వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం విశేషం. ఇంత వయస్సు వచ్చిన ఆమె ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. ఇందుకు సంబంధించి ఆమెను పలువురు ప్రశ్నించగా ఆమె చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది. నేనొక మలయాళ యాక్టర్ ను లవ్ చేశారని, అయితే అతడు నన్ను మోసం చేసి వేరొక అమ్మాయితో మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యాడని చెప్పింది. అతడే తన లైఫ్ అనుకుని భావించిన శోభనను.. అతడు మోసం చేయడంతో ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నదట శోభన. ఇదిలా ఉండగా శోభన ప్రస్తుతం ఒక పాపను అడాప్ట్ చేసుకుని ఆమె బాగోగులు చూస్తుంది. ఈ విషయంలో తాను సంతోషంగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చింది శోభన. ఆమె తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూ మరిన్ని పాత్రలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *