Breaking News

అంతా అమల వల్లే ..ఆ రోజు లక్ష్మీ కి ఈ రోజు చైతన్య కి గట్టి దెబ్బ

ఇప్పుడు టాలీవుడ్ లో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అంద‌రికీ విదిత‌మే. కాగా వీరి అనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్నో ర‌కాల వార్త‌లు నెట్టిట చెక్క‌ర్లు కొడుతున్నాయి. ఇందులో ఇప్పుడు ప్ర‌ధానంగా వినిపిస్తున్న‌మాట ఏంటంటే చైతు, స‌మంత‌లు విడిపోవ‌డానికి అమ‌ల కార‌ణ‌మంటూ కొన్ని గాసిప్స్ విన‌ప‌డుతున్నాయి. తండ్రి నాగార్జున జీవితంలో జ‌రిగిన‌ట్టే ఇప్పుడు చైత‌న్య విష‌యంలో కూడా జ‌రిగిందంటూ చెబుతున్నారు. ఒక‌ప్పుడు నాగార్జున స్టార్ హీరోగా ఎదుగుతున్న క్ర‌మంలోనే రామానాయుడి కూతురును పెండ్లి చేసుకున్నారు.

రామానాయుడు త‌న కూతురు శ్రీ ల‌క్ష్మికి ఏఎన్నార్ కొడుకు నాగార్జున‌కు ఇచ్చి వివాహం జ‌రిపించ‌గా వారికి నాగ‌చైత‌న్య పుట్టాడు. అయితే ఈ క్ర‌మంలోనే నాగార్జున త‌న‌తో పాటు కొన్ని సినిమాల్లో న‌టించిన అమ‌ల‌తో ప్రేమ‌లో ప‌డ‌టం వారిద్ద‌రూ స‌న్నిహితంగా ఉండ‌టంతో ఇదంతా న‌చ్చ‌ని శ్రీల‌క్ష్మి కోపంతో నాగార్జున‌కు విడాకులు ఇచ్చింద‌నే గాసిప్స్ ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇక‌పోతే వీరు విడాకులు తీసుకున్నాక అమ‌ల నాగార్జునను పెండ్లి చేసుకోవ‌డంతో ఈ అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. కాగా నాడు నాగ‌చైత‌న్య త‌ల్లి శ్రీల‌క్ష్మి విష‌యంలో జ‌రిగిన విడాకుల వ్య‌వ‌హ‌రానికి కార‌ణం అయిన అమ‌లే నేడు కొడుకు జీవితంలో జ‌రిగిన దానికి కార‌ణం అంటూ చెబుతున్నారు.

స‌మంత విష‌యంలో మొద‌టి నుంచి అమ‌ల పెడుతున్న కొన్ని కండీష‌న్లు స‌మంత‌కు న‌చ్చ‌క‌పోయినా వాటిని క‌చ్చితంగా ఫాలో కావాలంటే ఆమె నాగార్జున ద్వారా చెప్పించ‌డంతో ఇవేమీ ఇష్టం లేని స‌మంత త‌న ప్రైవ‌సీకి భంగం క‌లిగింద‌నే భావ‌న‌తోనే చైతూకు దూరంగా ఉంటుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక నాగార్జున మాట కాద‌న‌లేని చైతు వారు పెట్టే కండీష‌న్లు ఫాలో కావాలంటూ స‌మంత మీద ప్రెష‌ర్ తీసుకురావ‌డంతోనే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు, అపోహ‌లు పెరిగ‌యానే గాసిప్స్ కూడా న‌డు్తున్నాయి. ఇప్పుడు ఈ రూమ‌ర్లు సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతున్నాయి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *